Google: పలు యాప్ లను గూగుల్ తొలగిస్తుండడంపై కేంద్రం స్పందన

Center reacts on Google removing some apps from playstore
  • సర్వీసు ఫీజు చెల్లించడంలేదంటూ  పలు యాప్ లపై గూగుల్ చర్యలు
  • ప్లేస్టోర్ నుంచి మ్యాట్రిమొనీ యాప్ ల తొలగింపు
  • గూగుల్ చర్యను తప్పుబట్టిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
  • స్టార్టప్ లు, చిన్న టెక్ కంపెనీల తలరాతను పెద్ద టెక్ కంపెనీలు నిర్ణయించకూడదని హితవు
టెక్ దిగ్గజం గూగుల్ పలు భారత మ్యాట్రిమొనీ యాప్ లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తన ప్లాట్ ఫాంను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందుతూ 10 యాప్ లు సర్వీసు ఫీజు చెల్లించడం లేదంటూ గూగుల్ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో పలు భారత మ్యాట్రిమొనీ యాప్ లపై గూగుల్ చర్యలకు దిగింది. 

దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సర్వీసు ఫీజు చెల్లించలేదన్న కారణంతో యాప్ లను తొలగించడం సరికాదని కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. స్టార్టప్ లు, చిన్న టెక్ సంస్థల తలరాతలను గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు నిర్ణయించరాదని హితవు పలికారు. స్టార్టప్ లు కోరుకునే రక్షణ కల్పించడం తమ ప్రభుత్వ ముఖ్యమైన విధి అని స్పష్టం చేశారు. 

గత పదేళ్ల కాలంలో దేశంలో బలమైన స్టార్టప్ ఎకో సిస్టమ్ ఏర్పడిందని, 1 లక్ష స్టార్టప్ లు తెరపైకి వచ్చాయని, 100 యూనికార్న్ కంపెనీలు ఏర్పడ్డాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. పెద్ద సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారని, వారు పెద్ద టెక్ కంపెనీల విధానాలకు బలి కారాదని అన్నారు.
Google
Apps
Playstore
NDA
India

More Telugu News