Bandi Sanjay: బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్... ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ అంటే..!

BJP releases 9 names from telangana for lok sabha elections
  • సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్‌లకు మరోసారి అవకాశం
  • చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం
  • బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన బీబీ పాటిల్‌కు జహీరాబాద్ టిక్కెట్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి తొమ్మిది లోక్ సభ స్థానాలకు బీజేపీ అగ్రనాయకత్వం అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం సాయంత్రం బీజేపీ 195 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేస్తూ తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి తొమ్మిది మందిని ప్రకటించారు. కేంద్రమంత్రి, తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత ధర్మపురి అరవింద్‌లకు మరోసారి టిక్కెట్ దక్కింది.

మాజీ మంత్రి, తెలంగాణలో కీలక బీసీ నాయకుడిగా ఉన్న ఈటల రాజేందర్‌నూ బీజేపీ బరిలోకి దింపుతోంది. ఇటీవల పార్టీలో చేరిన బీబీ పాటిల్‌తో పాటు హైదరాబాద్ నుంచి మహిళకు ప్రాధాన్యతనిస్తూ మాధవీలతకు టిక్కెట్ కేటాయించింది.

ఏయే స్థానాల నుంచి ఎవరెవరు?

హైదరాబాద్ - డాక్టర్ మాధవీలత
సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి
మల్కాజిగిరి - ఈటల రాజేందర్
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి
నాగర్ కర్నూల్ - పీ భరత్ 
కరీంనగర్ - బండి సంజయ్
భువనగిరి - బూర నర్సయ్య గౌడ్
నిజామాబాద్ - ధర్మపురి అరవింద్
జహీరాబాద్ - బీబీ పాటిల్
Bandi Sanjay
Etela Rajender
BJP
Telangana

More Telugu News