Revanth Reddy: తెలంగాణలో మార్చి 11న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ప్రారంభం

The Indiramma Housing Scheme will be launched on March 11
  • ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • అర్హులైన లబ్ధిదారునికి సొంత ఇంటి స్థలం లేకుంటే స్థలం, రూ.5 లక్షలు ఇవ్వనున్న ప్రభుత్వం
  • ఇప్పటికే పలు పథకాలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పథకాన్ని మార్చి 11న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని కూడా ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేస్తుంది. అర్హులైన లబ్ధిదారునికి సొంత ఇంటి స్థలం లేకుంటే ప్రభుత్వం స్థలం, రూ.5 లక్షలు అందిస్తుంది.
Revanth Reddy
Seethakka
Telangana

More Telugu News