10th Class: ఏపీలో రేపు పదో తరగతి హాల్ టికెట్ల విడుదల

Tenth class hall tickets will release tomorrow
  • ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు
  • ఉదయం 9.30 గంటల  నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు
  • మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హాల్ టికెట్ల విడుదల
  • bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్ల డౌన్ లోడ్
ఏపీలో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపు (మార్చి 4) పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి bse.ap.gov.in వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. 

రాష్ట్రంలోని పాఠశాలల లాగిన్ తో పాటు, విద్యార్థులు కూడా స్వయంగా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థి తన పేరు, స్కూల్ పేరు, జిల్లా, వివరాలు, డేటాఫ్ బర్త్ వివరాలతో హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

ఏపీలో పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహిస్తున్నారు.
10th Class
Hall Tickets
Exams
Andhra Pradesh

More Telugu News