MLC Bharath: స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్

YCP MLC Bharath inaugurates smuggler Verrappan memorial
  • మూడు రాష్ట్రాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్
  • కుప్పం నియోజకవర్గంలోని కాకర్లవంకలో ఏర్పాటు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
స్మగ్లింగ్ తో, హత్యలతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ఆవిష్కరించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం అబకలదొడ్డి పంచాయతీలోని కాకర్లవంకలో కొందరు వ్యక్తులు దీనిని నిర్మించారు.

స్మారకంపై వీరప్పన్ చిత్రపటంతోపాటు జెండాను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భరత్ ఈ స్తూపాన్ని ఆవిష్కరించి ఫొటోలకు పోజిచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో భరత్ కుప్పం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. వీరప్పన్ స్మారకాన్ని ఎమ్మెల్సీ ఆవిష్కరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
MLC Bharath
Chittoor District
Kuppam
YSRCP
Smuggler Verrappan

More Telugu News