Prashant Kishor: తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ అంచనాలు తప్పాయి: వైసీపీ

Prashant Kishor predictions missed in Telangana says YSRCP
  • ఏపీలో వైసీపీ ఓడిపోతుందన్న ప్రశాంత్ కిశోర్
  • పీకే వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ
  • తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని పీకే అంచనా వేశారని వ్యాఖ్య
ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని... ఏపీ ప్రజలు  మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ఉచిత పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని అన్నారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు. ఏపీలో టీడీపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం తెలిపారు. 

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను వైసీపీ ఖండించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారని... ఆయన అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని ఎక్స్ వేదికగా తెలిపింది. బీఆర్ఎస్ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొంది. ఏపీకి సంబంధించి పీకే చెపుతున్న అంచనాలకు ఆధారం ఏమిటని ప్రశ్నించింది. బీహార్ లో ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారనే విషయాన్ని మర్చిపోరాదని చెప్పారు.
Prashant Kishor
Andhra Pradesh
YSRCP
Telangana
BRS

More Telugu News