BC Declaration: బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
- పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
- చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు
- బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
మంగళగిరిలో జయహో బీసీ సభకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ ను విడుదల చేశారు. ఈ బీసీ డిక్లరేషన్ లో పలు కీలక అంశాలు ఉన్నాయి.
బీసీ డిక్లరేషన్ పాయింట్లు...
* బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్లు
* పెన్షన్ నెలకు రూ.4 వేలకు పెంపు
* బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
* సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు
* బీసీ సబ్ ప్లాన్ తో ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల కేటాయింపు... సబ్ ప్లాన్ నిధులు బీసీలకే వినియోగించేలా చర్యలు
* స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ
* చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
* అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్... కొన్ని బీసీ వర్గాలకు కోఆప్షన్ సభ్యులుగా అవకాశం
* జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు... జనాభా దామాషా ప్రకారం నిధుల కేటాయింపు
* బీసీల స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్లు... రూ.5 వేల కోట్లతో 'ఆదరణ' పరికరాలు.
* బీసీలకు పారిశ్రామిక ప్రోత్సాహకాల పునరుద్ధరణ
* చట్టబద్ధంగా కులగణన
* రూ.10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ
* చంద్రన్న పెళ్లికానుక రూ.1 లక్షకు పెంపు
* శాశ్వత కుల ధృవీకరణ పత్రాల అందజేత
* విద్యాపథకాలు అన్నీ పునరుద్ధరణ
* బీసీ గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం
* షరతులు లేకుండా విదేశీ విద్య
* పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్ధరణ
* ఏడాది లోపు బీసీ భవనాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి