Nara Lokesh: రాయలసీమలో లోకేశ్ మలివిడత శంఖారావం.. షెడ్యూల్ ఇదిగో!
- గురువారం హిందూపురం నుంచి ప్రారంభం
- కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయనున్న యువనేత
రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేశ్ మలివిడత శంఖారావం యాత్ర చేపడతారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాయలసీమలో పార్టీ కేడర్ ను సమాయత్తం చేయడానికి గురువారం (ఈ నెల 7) హిందూపురం నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువనేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు. ఈ సందర్భంగా మన టీడీపీ, బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల అమలులో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలతో భేటీ అయి వారికి ప్రశంసాపత్రాలను అందజేస్తారు. తొలివిడతలో ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపింది.
టీడీపీ-జనసేన కార్యకర్తలతోపాటు పెద్దఎత్తున ప్రజలు శంఖారావం సభలవద్దకు చేరుకొని జగన్ పాలనలో తాము పడుతున్న ఇబ్బందులను యువనేతకు చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో శంఖారావం మలివిడత యాత్రను తన మామ, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు. తొలిరోజు ఉదయం హిందూపురం, మధ్యాహ్నం మడకశిర, సాయంత్రం పెనుకొండ నియోజకవర్గాల్లో శంఖారావం సభలు నిర్వహిస్తారు. ఈ నెల 8 న ఉదయం పుట్టపర్తి, మధ్యాహ్నం కదిరి సభలకు లోకేశ్ హాజరవుతారు. శివరాత్రి నేపథ్యంలో 9న యాత్రకు తాత్కాలిక విరామం ఉంటుంది. తిరిగి ఈ నెల 10 నుంచి యాత్ర యథావిధిగా కొనసాగనుంది.
యువగళం స్పూర్తితోనే శంఖారావం
ప్రజల్లో చైతన్యం నింపడమే లక్ష్యంగా యువనేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 226 రోజులపాటు 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 3132 కి.మీ.లు సాగింది. పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు.
పార్టీ అధినేత చంద్రబాబును జైలులో పెట్టడంతో యువగళానికి 79 రోజులపాటు సుదీర్ఘ విరామం ప్రకటించాల్సి వచ్చింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ విశాఖ జిల్లా అగనంపూడి వద్ద యువగళాన్ని గత ఏడాది డిసెంబర్ 18న అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను రాబోయే ఎన్నికలకు సిద్ధంచేయడంతోపాటు బాబు సూపర్ – 6 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువనేత లోకేశ్ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు.
యువనేత నారా లోకేశ్ శంఖారావం వివరాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 7-3-2024 (గురువారం) కార్యక్రమ వివరాలు
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (జీటీఎం లేఅవుట్, లోటస్ పబ్లిక్ స్కూలు దగ్గర)
ఉదయం 10.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
10.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
10-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
10.32 – హిందూపూర్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఆకుల ఉమేష్ ప్రసంగం.
10.34– హిందూపూర్ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నందమూరి బాలకృష్ణ ప్రసంగం.
10.36– హిందూపూర్ నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
10.56– పార్టీ కేడర్ తో లోకేశ్ ముఖాముఖి.
11.26– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
12.00 – యువనేత నారా లోకేశ్ మడకశిర నియోజకవర్గానికి చేరిక.
2.30 – మడకశిర నియోజకవర్గంలో భోజన విరామం.
మధ్యాహ్నం:: మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం (చీపులేటి గ్రామం, మడకశిర మున్సిపాలిటీ)
2.30 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
2.35 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
2-45 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
3.02 – మడకశిర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త టి. రంగస్వామి ప్రసంగం.
3.04 – మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఎమ్.ఈ సునీల్ కుమార్ ప్రసంగం.
3.06– మడకశిర నియోజకవర్గ శంఖారావం సభలో యువనేత లోకేశ్ ప్రసంగం.
3.26– పార్టీ కేడర్ తో యువనేత లోకేశ్ ముఖాముఖి.
3.54– పార్టీ కేడర్ కు లోకేశ్ చేతులమీదుగా సూపర్ - 6 కిట్ల అందజేత.
3.58– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేశ్.
3.59 – పార్టీకేడర్ తో యువనేత లోకేశ్ సెల్ఫీ.
4.55 – యువనేత పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
సాయంత్రం:: పెనుకొండ నియోజకవర్గం (తేజో కిరణ్ ఫ్యాక్టరీ, మడకశిర రోడ్, పెనుకొండ)
5.00 – హిందూపూర్ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు బీకే పార్థసారథి ప్రసంగం.
5.05 – ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన అధ్యక్షులు టీసీ వరుణ్ ప్రసంగం.
5-15 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టీడీపీ యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేశ్ అభినందన.
5.32 – పెనుకొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త ఈడిగ కుమార్ ప్రసంగం.
5.34 – పెనుకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఎస్.సవిత ప్రసంగం.
5.36 – పెనుకొండ నియోజకవర్గ శంఖారావంలో యువనేత నారా లోకేశ్ ప్రసంగం.
5.56 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేశ్ ముఖాముఖి.
6.26 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
6.28 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేశ్ ప్రతిజ్ఞ.
6.29 – పార్టీ కేడర్ తో యువనేత లోకేశ్ గ్రూప్ సెల్ఫీ.
6.30 – రోడ్డుమార్గం ద్వారా పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రయాణం
7.15 – పుట్టపర్తి నియోజకవర్గానికి చేరుకుని, అక్కడ బస చేస్తారు.