Ch Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీలో కూల్చివేతలు

Demolition of illegal constructions of Marri Rajasekhar Reddy
  • చిన్న దామరచెరువును కబ్జా చేసినట్టు ఫిర్యాదులు
  • చెరువును కబ్జా చేసి భవనాలను నిర్మించినట్టు అధికారుల నిర్ధారణ 
  • తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు
హైదరాబాద్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుండిగల్ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ... స్థలాలను ఆక్రమించినట్టు ఫిర్యాదులు రావడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇతర అధికారులతో కలిసి స్థలాలను పరిశీలించారు. చిన్న దామరచెరువును కబ్జా చేసి భవనాలను నిర్మించారని నిర్ధారణ కావడంతో కూల్చివేతలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు.
Ch Malla Reddy
Marri Rajasekhar Reddy
College
BRS

More Telugu News