MLC Kavitha: రాష్ట్రంలో కృత్రిమ కరవుకు సీఏం రేవంత్‌రెడ్డి అసమర్థతే కారణం: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- రేవంత్ డీఎన్ఏలోనే ప్రధాని మోదీతో స్నేహం ఉందంటూ విమర్శ
- మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపాటు
- మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
సీఏం రేవంత్‌రెడ్డి అసమర్థత కారణంగానే తెలంగాణలో కృత్రిమ కరవు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతోనే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని ఆమె విమర్శించారు. సీఏం రేవంత్ డీఎన్ఏలోనే ప్రధాని మోదీతో స్నేహం ఉందని, ఆయన బీజేపీలో చేరే అకాశం కూడా ఉందన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని కవిత దుయ్యబట్టారు. ఇక మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయపోరాటం చేస్తామని చెప్పిన ఆమె.. రేపు ధర్నా చౌక్ వద్ద దీక్ష చేపడతామని తెలిపారు.