YSRCP: మరో జాబితా విడుదల చేసిన వైసీపీ.. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ సర్జన్!
- మచిలీపట్నం ఎంపీ స్థానం సమన్వయకర్తగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్
- అవనిగడ్డ అసెంబ్లీ స్థానం సమన్వయకర్తగా సింహాద్రి రమేశ్
- సీఎం జగన్ ఆదేశాలతో మార్పులు చేర్పులు
అధికార వైసీపీ తాజాగా ఇద్దరు అభ్యర్థులతో మరో జాబితా విడుదల చేసింది. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి ప్రముఖ కేన్సర్ సర్జన్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సింహాద్రి రమేశ్ ను పార్టీ సమన్వయకర్తలుగా నియమించింది. సీఎం జగన్ ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల, అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ ను, మచిలీపట్నం ఎంపీ బరి నుంచి సింహాద్రి రమేశ్ ను బరిలో దించుతున్నట్టు వైసీపీ హైకమాండ్ నుంచి ప్రకటన వెలువడింది. అయితే, ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సింహాద్రి చంద్రశేఖర్ విముఖత వ్యక్తం చేయడంతో, అభ్యర్థులను అటూ ఇటూ మార్చారు. సింహాద్రి చంద్రశేఖర్ ను మచిలీపట్నం నుంచి ఎంపీగా, సింహాద్రి రమేశ్ ను అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తున్నట్టు తాజా జాబితా ద్వారా ప్రకటించారు.