BJP: బీజేపీతో పొత్తు కోసం టీడీపీ-జనసేన చర్చలు జరుపుతున్న వేళ విజయసాయి రెడ్డి కామెంట్స్
- టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికే తేడా ఏంటన్న వైసీపీ కీలక నేత
- 2014-19 మధ్య కాలంలో ఏపీలో మోసాలు, అబద్ధాలను ఏపీ చవిచూసిందని వ్యాఖ్య
- సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరిన విజయసాయి రెడ్డి
ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పొత్తు కోసం టీడీపీ-జనసేన అధినేతలు ప్రత్యక్షంగా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్న వేళ వైఎస్సార్సీపీ అగ్రనేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీ చేరినంత మాత్రాన 2014కి, ఇప్పటికీ పెద్ద వ్యత్యాసం ఏముందని ప్రశ్నించారు. 2014-19 మధ్య కాలంలో మోసాలు, అబద్ధాలు, అమలుపరచని వాగ్దానాలను ఏపీ చవిచూసిందని అన్నారు. కొత్త ప్యాకేజీలో వస్తున్న పాత ఉత్పత్తి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 3 కాళ్ల కుర్చీ నిలబడదని, సుస్థిర ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.