Odela 2: ‘శివ శక్తి’ గా మిల్కీ బ్యూటీ తమన్నా

Tamannaah shares first look as Shiva Shakthi from Odela 2 on Maha Shivaratri
  • మహా శివరాత్రి సందర్భంగా ‘ఓదెల 2’  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల‌
  • నాగ సాధువుగా తమన్నా లుక్ అదుర్స్
  • చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న సంప‌త్ నంది
శుక్ర‌వారం మహా శివరాత్రి సందర్భంగా ‘శివ శక్తి’ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్న ‘ఓదెల 2’  చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం వార‌ణాసిలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఆ స‌మ‌యంలో తీసిన కొన్ని ఫొటోల‌ను ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఎక్స్ (ఇంత‌కుముందు ట్విట‌ర్‌) వేదిక‌గా పంచుకున్నారు. ఇక 2022 వ‌చ్చిన సూపర్‌హిట్ ఓటీటీ చిత్రం 'ఓదెల రైల్వే స్టేషన్‌'కి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’ రాబోతోందని ఇటీవలే మూవీ యూనిట్ ప్ర‌క‌టించింది కూడా. 

ఇక‌ ఈ చిత్రంలో  ‘శివ శక్తి’ పాత్ర కోసం త‌మ‌న్నా తనను తాను పూర్తిగా మార్చుకుందనే చెప్పాలి. సాధువులా వేషం, ఒక చేతిలో కర్ర, మరో చేతిలో ఢ‌మరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో తమన్నా అచ్చం శివ శక్తిలానే కనిపిస్తుంది. కాశీ ఘాట్‌లలో ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు తాజాగా విడుదలైన పోస్ట‌ర్ ఉంది. కాగా, శివ శక్తి పాత్రలో నాగ సాధువుగా తమన్నా క‌నిపించ‌నున్నారు. ఇప్పటి వరకు కనిపించినట్లుగా గ్లామర్‌గా ఈ చిత్రంలో కనిపించే అవకాశం లేదు. ద‌ర్శ‌కుడు సంపత్‌ నంది ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Odela 2
Tamannaah
first look
Shiva Shakthi
Maha Shivaratri
Tollywood

More Telugu News