Dharmashala Test: ధర్మశాల టెస్టులో గిల్, రోహిత్ సెంచరీల వరద.. లంచ్ సమయానికి భారత్ స్కోర్ 264/1
- తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
- బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న రోహిత్, గిల్
- లంచ్ సమయానికి 46 పరుగుల ఆధిక్యంలో భారత్
ధర్మశాల టెస్టులో తొలి రోజు బంతితో వీరవిహారం చేసి ఇంగ్లిష్ బ్యాటర్ల నడ్డి విరిచిన భారత జట్టు.. రెండో రోజు బ్యాటింగులోనూ దుమ్మురేపుతోంది. కెప్టెన్ రోహిత్‌శర్మ, యువ ఆటగాడు శుభమన్‌గిల్ ఇద్దరూ శతకాలు బాది జోరుమీదున్నారు. రోహిత్ 160 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 102 పరుగులు; గిల్ 142 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 101 పరుగుల చేసి క్రీజులో ఉన్నారు. లంచ్ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 264 పరుగులు చేసి ప్రత్యర్థి కంటే 46 పరుగుల ఆధిక్యం సాధించింది. యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి అవుటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిన్న తన తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలీ చేసిన 79 పరుగులే అత్యధికం. టీమిండియా బౌలర్లు అశ్విన్, కుల్దీప్ యాదవ్ పోటీపడి వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 218 పరుగులకే చాపచుట్టేసింది. కుల్దీప్ 5, అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకున్నారు.