K Kavitha: జీఓ నం.3 ర‌ద్దు చేయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్‌

BRS MLC Kavitha demand cancel GO No 3
  • భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష‌
  • ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు జీఓ నం.3 శ‌రాఘాత‌మ‌న్న‌ ఎమ్మెల్సీ క‌విత
  • మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రిగే జీఓ నం.41ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్‌
భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత హైదరాబాదులోని ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష‌కు దిగారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు జీఓ నం.3 శ‌రాఘాతంగా నిలుస్తోంద‌ని క‌విత ఆరోపించారు. ఈ జీఓను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఆమె డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ఈ జీఓ ద్వారా మ‌హిళ‌ల‌కు ఉద్యోగ నియామ‌కాల్లో అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆమె అన్నారు. మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రిగే జీఓ నం.41ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. అలాగే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో చ‌నిపోయిన అమ్మాయిని కూడా కాంగ్రెస్ రాజ‌కీయంగా వాడుకుంద‌ని ఆమె విమ‌ర్శించారు.
K Kavitha
BRS
MLC
GO No 3
Telangana
Hyderabad

More Telugu News