Canada Shooting: కెనడాలో భారత సంతతి వ్యాపారి ఇంటిపై గ్యాంగ్‌స్టర్ కాల్పులు

Shots fired at Indian Origin business man house in canada
  • మూడు రోజుల క్రితం జరిగిన ఘటన
  • ఘటన తాలూకు వీడియో తాజాగా వెలుగులోకి
  • ఘటన వెనక వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ఉండొచ్చన్న అనుమానాలు
కెనడాలోని ఓ భారత సంతతి వ్యాపారి ఇంటిపై గుర్తుతెలియని గ్యాంగ్ స్టర్ కాల్పులకు తెగబడ్డాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న భారత గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ గ్యాంగ్‌లోని సభ్యుడు ఈ కాల్పులకు తెగబడ్డట్టు స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయమై గ్యాంగ్ నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. 

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ అలియాస్ సతీందర్‌జిత్ సింగ్ భారత్‌తో పాటు కెనడాలోనూ వాంటెడ్ నేరస్తుల జాబితాలో ఉన్నాడు. ఇతడి గ్యాంగ్ కెనడాలో బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడం నిత్యకృత్యంగా మారినట్టు తెలుస్తోంది.
Canada Shooting
Goldi Brar Gang
Lawrence Bishoi Gang
Indian Origin Business man

More Telugu News