KTR: ఎల్ఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
- ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని లేఖలో పేర్కొన్న కేటీఆర్
- ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలను ఎందుకు దోచుకుంటున్నారు? అని ప్రశ్న
- ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని... ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేయాలన్న కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అని గతంలో మీరే చెప్పారని... ఇప్పుడు ఛార్జీలు వసూలు చేయకూడదని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో మీరు ప్రజలను ఎందుకు దోచుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ప్రజల కోరిక మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్‌పై గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్‌ను తమ నిరసన కార్యక్రమం, వినతి పత్రాల రూపంలో మీ ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు... డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని... ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.