Nara Lokesh: సీఎం ఏకంగా మార్ఫింగ్ ఫొటోలు వేసి, నా మీటింగ్ కి ప్రజలు వచ్చారు అని చెప్పుకోవటం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూశారా?: నారా లోకేశ్
- డ్రోన్ షార్ట్స్, గ్రీన్ మ్యాట్ తో జగన్ దొరికిపోయారన్న లోకేశ్
- ఫొటోలు మార్ఫింగ్ చేసి వదిలారని ఎద్దేవా
- ఎన్ని చీఫ్ ట్రిక్స్ వేసినా నిన్ను జనం చిత్తుగా ఓడించడం ఖాయమని వ్యాఖ్య
సీఎం జగన్ సిద్ధం సభలకు జనం రాకపోయినా... మార్ఫింగ్ ఫొటోలు వేసుకుంటూ సభ విజయవంతమైనట్టు చెప్పుకుంటున్నారని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా లోకేశ్ స్పందిస్తూ... ఆంధ్రప్రదేశ్ సీఎం ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు వేసి, నా మీటింగ్ కి ప్రజలు వచ్చారు అని చెప్పుకోవటం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. డ్రోన్ షార్ట్స్ తో, గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారని అన్నారు. అందుకే, ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వదిలారని చెప్పారు. ఈ ఫోటోని ఎలా మార్ఫింగ్ చేసి ప్రజలను మభ్య పెట్టాడో చూడండంటూ... ఫొటోలను షేర్ చేశారు. 'జగన్.. నీకు ప్రజల మద్దతు లేదు. నువ్వు ఎంత మభ్య పెట్టాలని చూసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ వేసినా, ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయం' అని ట్వీట్ చేశారు.