Agni-5: శత్రుభయంకర అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం... గర్విస్తున్నామన్న ప్రధాని మోదీ

Modi applauds Agni 5 missile maiden test flight
  • భారత రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టం
  • దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 ప్రయోగం విజయవంతం
  • ఎంఐఆర్వీ టెక్నాలజీతో తిరుగులేని క్షిపణికి రూపకల్పన
  • మొదటి ప్రయోగంలోనే గ్రాండ్ సక్సెస్
భారత్ రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణిని పూర్తి దేశీయంగా అభివృద్ధి చేశారు. దీన్ని మొదటిసారిగా గాల్లోకి పంపగా, అంచనాలను అందుకుంటా డీఆర్డీవో శాస్త్రవేత్తలను ఆనందానికి గురిచేసింది. ఈ ప్రాజెక్టును మిషన్ దివ్యాస్త్రగా పేర్కొంటున్నారు.

అగ్ని-5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ (ఎంఐఆర్వీ) టెక్నాలజీ వినియోగించారు. ఎంఐఆర్వీ టెక్నాలజీతో రూపొందించిన క్షిపణిని ఒక్కసారి ప్రయోగించాక... అందులోని వార్ హెడ్ పలు శాఖలుగా విడిపోయి, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. 

మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డీఆర్డీవో సైంటిస్టులను అభినందించారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని తెలిపారు. 

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా అగ్ని-5 పరీక్షపై స్పందించారు. ఇక నుంచి భారత్ పై ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అగ్ని-5తో భారత రక్షణ సామర్థ్యం మరో ఎత్తుకు చేరిందని వివరించారు.
Agni-5
MIRV
DRDO
Narendra Modi
India

More Telugu News