Delhi Encounter: ఢిల్లీలో అర్ధరాత్రి కలకలం రేపిన ఎన్‌కౌంటర్.. ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ల అరెస్ట్

Delhi Encounter 3 Hashim Baba gang members arrested after gunfire encounter
  • ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపిన గ్యాంగ్
  • పక్కా సమాచారంతో గతరాత్రి పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు
  • పోలీసులపై కాల్పులు జరిపిన ముఠా
  • కాళ్లలో కాల్చి నిందితులను పట్టుకున్న పోలీసులు
నిన్న రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఢిల్లీ పోలీసులు ముగ్గురు కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లను అరెస్ట్ చేశారు. హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు ఈ నెల 9న అర్బాజ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. నిందితుల కదలికలపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు గత రాత్రి 1.30 సమయంలో ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపానికి వెళ్లారు.

వారిని గమనించిన గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో దుండగుల కాళ్లకు గాయాలు కావడంతో కదల్లేకపోయారు. వెంటనే వారిని పట్టుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు కూడా గాయపడినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Delhi Encounter
Hashim Baba Gang
Delhi
Crime News

More Telugu News