Pavala Shyamala: ఇలాంటి దుస్థితి వస్తుందని ఊహించలేదు.. కంటతడి పెట్టిస్తున్న పావలా శ్యామల వీడియో

Actor Pavala Shyamala Latest Interview
  • హీరోలందరితో నటించా.. తాజా ఇంటర్వ్యూలో శ్యామల ఆవేదన
  • ఎన్నో హిట్ సినిమాల్లో ఉన్నా ఆర్థికంగా స్థిరపడలేదన్న నటి
  • వీల్ చైర్ కు పరిమితమై, అనాథగా బతుకీడుస్తున్నట్లు వెల్లడి
‘‘హీరోలు అందరితో కలిసి నటించా.. సూపర్ హిట్ సినిమాల్లో మంచి పాత్రలు పోషించా.. అయినా ఆర్థికంగా స్థిరపడలేకపోయా’’ అంటూ సీనియర్ నటి పావలా శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ గౌరవమర్యాదలు అందుకున్న తనకు ఇప్పుడీ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. ఈమేరకు తాజాగా ఓ రియాలిటీ షోకు వచ్చిన శ్యామల.. అక్కడి ప్రేక్షకులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో అనాథగా, వీల్ చైర్ కు పరిమితమై బతుకీడుస్తున్నానని శ్యామల తన కష్టాలను చెప్పుకుంటూ ప్రేక్షకులను కంటతడి పెట్టించారు.

అయితే, తన కష్టాలను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని ఈ షోకు రాలేదని శ్యామల చెప్పారు. మళ్లీ మిమ్మల్ని (ప్రేక్షకులను) చూస్తానో లేదోనని, ఒకసారి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే వచ్చానని వివరించారు. మరోసారి మీ అభిమానం పొందాలనే ఇప్పుడిలా మీ ముందుకు వచ్చానని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో పావలా శ్యామల దీనస్థితి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో కనిపిస్తూనే ఉంది. కొంతకాలం క్రితం నటుడు కాదంబరి కిరణ్ 'మనం సైతం' ఫౌండేషన్ తరఫున శ్యామలకు రూ.25 వేల ఆర్థిక సాయం చేశారు. మెగస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు అగ్ర హీరోలు కూడా గతంలో పావలా శ్యామలను ఆర్థికంగా ఆదుకున్నారు.
Pavala Shyamala
Actress
Shyamala Health
Entertainment

More Telugu News