TeluguDMF: తెలుగు డీఎంఎఫ్... ఇది గేమ్ చేంజర్ కానుంది: మహేశ్ బాబు
- తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఐక్య వేదిక
- ఇటీవల లాంచ్ చేసిన చిరంజీవి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- తెలుగు డీఎంఫ్... కంటెంట్ క్రియేటర్లందరినీ ఏకం చేస్తుందన్న మహేశ్
తెలుగు మీడియా రంగంలో తొలిసారిగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల కోసం ఓ ఐక్య వేదిక ఏర్పడింది. దాని పేరు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ (తెలుగుడీఎంఎఫ్). ఇటీవల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు డీఎంఎఫ్ వెబ్ సైట్ ను లాంచ్ చేయగా, తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లోగో, పోస్టర్ ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. తెలుగు డీఎంఎఫ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లందరూ ఏకమవుతారని వివరించారు. ఇది కచ్చితంగా ఓ గేమ్ చేంజర్ అవుతుందని, మీడియా రంగంలో విప్లవాత్మక ఘట్టం అని అభివర్ణించారు.
ఈ వేదిక ఏర్పాటు వెనుక ఉన్న మేధో దార్శనికులందరికీ శుభాభినందనలు తెలుపుకుంటున్నట్టు మహేశ్ బాబు వెల్లడించారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.