Mallu Bhatti Vikramarka: మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది: మల్లు భట్టివిక్రమార్క
- సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం
- ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడి
- 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడి
మహిళలకు తమ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుందని... ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.