Chiranjeevi: ఓటు హక్కుపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

Chiranjeevi tweets on vote
  • త్వరలో సాధారణ ఎన్నికలు
  • యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలన్న చిరంజీవి
  • రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం ఓటు వేయాలని పిలుపు 
త్వరలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఓటు హక్కు ప్రాధాన్యంపై ట్వీట్ చేశారు. "మనదేశ 18వ లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండి" అంటూ చిరంజీవి యువ ఓటర్లకు పిలుపునిచ్చారు.
Chiranjeevi
Vote
General Elections
India

More Telugu News