Japan private Rocket: లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.. వీడియో ఇదిగో!
- రాకెట్ ను ప్రయోగించిన జపాన్ స్టార్టప్ కంపెనీ
- సొంత లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను ప్రయోగించిన స్పేస్ వన్
- లాంచ్ ప్యాడ్ ప్రాంతంలో అలముకున్న నల్లటి పొగ
వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైరోజ్... లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది. కుషిమోటో సిటీలోని లాంచ్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ను ప్రయోగించారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతం అయిఉంటే జపాన్ చరిత్రలో నింగిలోకి వెళ్లిన తొలి ప్రైవేట్ రాకెట్ గా రికార్డుల్లోకి ఎక్కేది. టోక్యో బేస్డ్ స్టార్టప్ కంపెనీ స్పేస్ వన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తన సొంత లాంచ్ ప్యాడ్ నుంచే రాకెట్ ను ప్రయోగించింది. రాకెట్ తో పాటు ప్రభుత్వానికి చెందిన ఒక చిన్న టెస్ట్ శాటిలైట్ ను కక్ష్యలోకి పంపే ప్రయత్నం చేసింది. అయితే, రాకెట్ లాంచ్ అయిన కొన్ని సెకన్లకే బ్లాస్ట్ అయింది. పేలుడు కారణంగా లాంచ్ ప్యాడ్ ప్రాంతమంతా నల్లటి పొగ అలముకుంది.