Dedeepya Rao: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌ దేదీప్యారావుపై మహిళ ఆకస్మిక దాడి

Tension prevails as Congress workers attack GHMC Corporator Dedeepya Rao
  • వెంగళరావు నగర్‌లో ఘటన
  • కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలు తొలగించమని కార్పొరేటర్ ఆదేశం
  • కార్పొరేటర్‌ను అడ్డుకుని దాడికి దిగిన మహిళలు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల బాహాబాహీ
హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై గతరాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను ఆమె ఆదేశించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది.
 
కాంగ్రెస్ నేత మద్దతుదారులైన మహిళలు వెంగళరావునగర్ చేరుకుని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అప్రమత్తమైన దేదీప్యారావు మద్దతుదారులు అక్కడకు చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు భౌతికదాడికి దిగాయి. ఈ గొడవతో కారు నుంచి కిందకు దిగిన కార్పొరేటర్‌పైనా మహిళలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Dedeepya Rao
BRS
Congress
GHMC
Attack

More Telugu News