CM Jagan: ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్న సీఎం జగన్

CM Jagan will release final list of YSRCP candidates on Mar 16
  • ఎన్నికలకు సిద్ధం అంటున్న ఏపీ అధికార పక్షం వైసీపీ
  • ఇప్పటికే 12 జాబితాల విడుదల
  • ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద తుది జాబితా ప్రకటించనున్న సీఎం జగన్  
ఏపీ అధికార పక్షం వైసీపీ సార్వత్రిక ఎన్నికలకు సై అంటోంది. ఇటీవల టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీల పొత్తు ఖరారు కాగానే సిద్ధం అంటూ సవాల్ విసిరిన వైసీపీ... అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఓ కొలిక్కి తెచ్చింది. ఈ నెల 16న వైసీపీ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఏపీ సీఎం జగన్ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ఈ తుది జాబితాను విడుదల చేయనున్నారు. 

అభ్యర్థులకు సంబంధించి వైసీపీ ఇప్పటిదాకా 12 జాబితాలు విడుదల చేసింది. రాష్ట్రంలో ఇంకా అనేక చోట్ల అసంతృప్త గళాలు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు ప్రతి రోజూ సీఎం జగన్ వివిధ నియోజకవర్గాల నేతలను సీఎంవోకు పిలిపించుకుని మాట్లాడుతూనే ఉన్నారు. ఇవాళ కూడా నగరి నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి రోజా, తదితరులతో మాట్లాడినట్టు తెలుస్తోంది.
CM Jagan
YSRCP
Final List
Andhra Pradesh

More Telugu News