Mithun Reddy: ఆ అన్ని పార్టీల్లోనూ చంద్రబాబు మనుషులే!: ఎంపీ మిథున్ రెడ్డి

MP Mithun Reddy Hot Comments on Alliance Issue in AP
  • అన్ని పార్టీల్లో చంద్రబాబు కోవర్టులు ఉన్నారన్న మిథున్ రెడ్డి
  • జనసేనకు ఇచ్చిన సీట్లలో 11 చోట్ల టీడీపీ మనుషులే పోటీలో ఉన్నారని వ్యాఖ్య
  • బీజేపీ, కాంగ్రెస్‌లోనూ ఇదే కనిపిస్తోందని విమర్శ
ఏపీలో రాజకీయ పొత్తులపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అన్ని పార్టీల్లోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారన్నారు. పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన సీట్లలో 11 చోట్ల టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తరపున పోటీ చేసేది కూడా వాళ్లేనని అన్నారు. కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవర్టేనన్న ఆయన.. అన్ని పార్టీలు ఏకమై సీఎం జగన్‌పై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు. వాలంటీర్లను తొలగిస్తారని కూడా చెప్పారు.
Mithun Reddy
YSRCP
YS Jagan
Janasena
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News