Dangerous dog breeds: ఈ కుక్క‌లు చాలా ప్ర‌మాద‌క‌రం.. 23 జాతుల పెంపుడు శున‌కాల‌పై కేంద్రం బ్యాన్‌!

23 dangerous dog breeds banned by the government in India

  • 23 జాతుల పెంపుడు కుక్క‌ల బ్రీడింగ్‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని కేంద్రం ఆదేశాలు
  • రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ లేఖ‌
  • నిషేధిత జాబితాలో పిట్‌బుల్ టెర్రియ‌ర్‌, అమెరిక‌న్ బుల్‌డాగ్‌, రోట్‌వీల‌ర్‌, మ‌స్టిఫ్స్‌
  • నిపుణుల క‌మిటీ నివేదిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డి

త‌ర‌చుగా దాడుల‌కు పాల్ప‌డుతూ మ‌నుషుల ప్రాణాలు తీస్తున్న 23 రకాల జాతుల పెంపుడు కుక్క‌ల అమ్మ‌కాల‌ను కేంద్రం బ్యాన్ చేసింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌విగా పేర్కొన్న కేంద్రం.. వెంట‌నే వాటి సంతాన వృద్ధి (బ్రీడింగ్‌) ని నిలిపివేయాలని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు కేంద్ర ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ లేఖ‌లు రాసింది. 

పిట్‌బుల్ టెర్రియ‌ర్‌, అమెరిక‌న్ బుల్‌డాగ్‌, రోట్‌వీల‌ర్‌, మ‌స్టిఫ్స్‌, టొసా ఇను, అమెరిక‌న్ స్టాఫ‌ర్డ్ షైర్ టెర్రియ‌ర్‌, డోగో అర్జెంటీనో, సెంట్ర‌ల్ ఆసియ‌న్ షెఫ‌ర్డ్‌, సౌత్ ర‌ష్య‌న్ షెఫ‌ర్డ్‌, వూల్ఫ్ డాగ్స్‌, మాస్కో గార్డ్ త‌దిత‌ర జాతుల కుక్క‌లు ఈ జాబితాలో ఉన్నాయి. పౌరులు, పౌర సంస్థ‌లు, జంతు సంర‌క్ష‌ణ సంస్థ‌ల నుంచి వ‌చ్చిన విన‌తుల‌ను ప‌రిశీలించి నిపుణుల క‌మిటీ ఇచ్చిన నివేదిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కేంద్రం వెల్ల‌డించింది.

  • Loading...

More Telugu News