Chandrababu: ఎప్పటిలాగే ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం: చంద్రబాబు

Chandrababu says TDP gave priority to people opinion in second list also
  • ఎన్నికలకు సై అంటున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం
  • 34 మందితో రెండో జాబితా విడుదల చేసిన టీడీపీ
  • టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నేడు 34 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

"రాబోయే 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తీసుకువచ్చాం. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చాం" అని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
TDP
Second List
Andhra Pradesh

More Telugu News