Mohammed Shami: లండ‌న్ నుంచి స్వ‌దేశానికి ప‌య‌న‌మైన‌ మ‌హ్మ‌ద్ ష‌మీ

Grateful to be back in India after surgery says Mohammed Shami
  • వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ష‌మీకి చీల‌మండ గాయం
  • ఇటీవ‌లే లండ‌న్‌లో స‌ర్జ‌రీ
  • ఇండియాకి తిరిగి వ‌స్తున్న‌ట్లు విమానంలోని ఫొటోల‌ను ట్వీట్ చేసిన ష‌మీ
  • అభిమానుల మ‌ద్ద‌తు, ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన స్టార్ పేస‌ర్‌ 
  • సెప్టెంబ‌ర్‌లో బంగ్లాతో జ‌రిగే సిరీస్‌లో ఆడ‌నున్నట్ల ప్ర‌క‌ట‌న‌
లండ‌న్‌లో చీల‌మండ గాయానికి స‌ర్జ‌రీ చేయించుకున్న భార‌త స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ తిరిగి స్వ‌దేశానికి బ‌య‌ల్దేరాడు. స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకొని స్వ‌దేశానికి తిరిగి వ‌స్తున్న‌ట్లు ష‌మీ ట్వీట్ చేశాడు. ఈ సంద‌ర్భంగా విమానంలో దిగిన ఫొటోల‌ను అత‌డు త‌న ట్వీట్‌కు జోడించాడు. "త‌దుప‌రి అధ్యాయాన్ని స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నా. మీ మ‌ద్ద‌తు, ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు" అని ష‌మీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు అత‌డు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుతూ.. 'గెట్ వెల్ సూన్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

కాగా, ష‌మీ గ‌తేడాది స్వ‌దేశంలో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి అత‌డు క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. మ‌రో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కూడా ఆడ‌డం లేద‌ని ఇటీవలే బీసీసీఐ ప్ర‌క‌టించింది. తిరిగి ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో జ‌రిగే సిరీస్‌కు ష‌మీ అందుబాటులో ఉంటాడ‌ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా వెల్ల‌డించారు.
Mohammed Shami
Surgery
London
Team India
Cricket
Sports News

More Telugu News