Royal Challengers Bangalore: విరాట్ కోహ్లీ లేకుండానే ప్రాక్టీస్ మొదలుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ఆర్సీబీ ప్రీ-టోర్నమెంట్ క్యాంప్‌లో పాల్గొన్న కీలక ఆటగాళ్లు
- కెప్టెన్ డుప్లెసిస్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను షేర్ చేసిన యాజమాన్యం
- జట్టుతో ఇంకా కలవని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న మరో వారం రోజుల్లోనే ఆరంభం కానుంది. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ఆరంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. టోర్నీలో ఆరంభ మ్యాచ్ ఆడబోతున్న ఆర్సీఐ కూడా ప్రీ-టోర్నమెంట్ క్యాంపును షురూ చేసింది. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆర్సీబీ కీలక అప్డేట్ ఇచ్చింది. కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. ‘బ్యాట్‌తో బంతిని తరలించే ముందు నిశితంగా గమనించాలి’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా డుప్లెసిస్‌తో పాటు కీలక ఆటగాళ్లు జట్టుతో కలిశారు. అయితే ఆ టీమ్ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంకా జట్టుతో కలవలేదు. ఐపీఎల్ 2024 ఎడిషన్ ఆరంభానికి 8 రోజుల తక్కువ సమయం మాత్రమే ఉన్నప్పటికీ కోహ్లీ ఇంకా ఆర్సీబీ శిబిరంలో చేరకపోవడం ఆసక్తికరంగా మారింది.
ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ తర్వాత క్రికెట్‌కు దూరంగా కోహ్లీ
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. 2024 జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టలేదు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జూన్ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లీకి చోటు దక్కకపోవచ్చంటూ ఇటీవల కథనాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. ఇదిలావుంచితే కోహ్లీ భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.