Electoral Bond Donors: ఎలక్టోరల్ బాండ్స్.. పార్టీలకు భారీగా నిధులు ఇచ్చిన కార్పొరేట్ సంస్థలు ఇవే!

Electoral bonds Top 10 donors to political parties

  • సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈసీకి ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు సమర్పించిన ఎస్బీఐ
  • బాండ్స్ వివరాలను గురువారం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఈసీ
  • 2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకూ డేటా సమర్పించిన ఎస్బీఐ

ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పార్టీలకు విరాళాలిచ్చిన దాతల వివరాలను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) గురువారం తన వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. ఈ సమాచారాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ఈసీకి అందించిన విషయం తెలిసిందే. పారదర్శకత కోసం ఈ వివరాలను ప్రజల ముందు ఉంచాలన్నదే తమ అభిమతమని ఈసీ గతంలోనే సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ఈసీ వివరాల ప్రకారం పార్టీలకు భారీ విరాళాలు ఇచ్చిన టాప్ 10 దాతలు వీరే...

  • ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ పీఆర్ - రూ.1368 కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ - రూ.966 కోట్లు
  • క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ. 410 కోట్లు
  • వేదాంత లిమిటెడ్ - రూ. 400 కోట్లు
  • హల్దియా ఎనర్జీ లిమిటెడ్ - రూ 377 కోట్లు
  • భారతీ గ్రూప్ - రూ. 247 కోట్లు
  • ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - రూ. 224 కోట్లు
  • వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ - రూ. 220 కోట్లు
  • కెవెంటర్ ఫుడ్‌పార్క్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ - రూ. 195 కోట్లు
  • మదన్‌లాల్ లిమిటెడ్ - రూ.185 కోట్లు

2019 ఏప్రిల్ 12 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకూ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్ల వివరాలను ఈసీకి ఇచ్చినట్టు ఎస్బీఐ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం 22,217 బాండ్ల కొనుగోళ్లు జరిగాయని సుప్రీంకోర్టుకు తెలిపింది.

  • Loading...

More Telugu News