Dharmana Prasada Rao: ఇన్నాళ్లూ ఎన్నికల్లో గెలుస్తానో లేదో అనే ఆవేదనతో ఉండేవాడిని.. మంత్రి ధర్మాన ఆసక్తికర వ్యాఖ్యలు

It does not matter if I lose in the AP Polls says Minister Dharma prasad Rao
  • రోజులు గడిచేకొద్దీ గెలుస్తాననే నమ్మకం పెరుగుతోందన్న ధర్మాన
  • తాను ఓడిపోయినా పర్వాలేదన్న వైసీపీ సీనియర్ నేత
  • కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
రాబోయే ఎన్నికల్లో గెలుస్తానో లేదో అని ఇన్నాళ్లూ ఆవేదనతో ఉండేవాడినని, కానీ రోజులు గడుస్తున్నకొద్దీ విజయం సాధిస్తాననే విశ్వాసం పెరుగుతోందని ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ‘‘మీ ఆదరణ ఉంటే చాలు. ఇక నేను ఓడిపోయినా పర్వాలేదు’’ అని అన్నారు. గురువారం శ్రీకాకుళంలో జరిగిన కళింగ వైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ధర్మాన ప్రసాదరావు ఈ మేరకు మాట్లాడారు. కళింగ వైశ్య సంఘ నాయకుల మద్దతు తనకు లభించదని గతంలో భావించానని చెప్పారు. అయితే జిల్లా, నగర కళింగ వైశ్య సంఘ నాయకులు వైఎస్సార్‌సీపీని గెలిపించాలనుకోవడం తనకు సంతోషంగా ఉందన్నారు.
Dharmana Prasada Rao
YSRCP
AP Assembly Polls
Andhra Pradesh

More Telugu News