Telugudesam: టీడీపీ రెండో జాబితా.. ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏడుగురు రాజకీయ వారసులు వీరే!

TDP candidates second list
  • తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏడుగురు రాజకీయ వారసులు
  • శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి
  • కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో జాబితాలో ఏడుగురు రాజకీయ వారసులకు చోటు దక్కింది. వీరంతా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 

తొలిసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న రాజకీయ వారసులు వీరే:
  • పుత్తా కృష్ణచైతన్య రెడ్డి - టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి కుమారుడు. యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కడప జిల్లా కమలాపురం టికెట్ ఇచ్చారు. 
  • బొజ్జల సుధీర్ రెడ్డి - శ్రీకాళహస్తి నియోజకవర్గం. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు. 
  • సింధూర రెడ్డి - పుట్టపర్తి నియోజకవర్గం. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు. 
  • కందికుంట యశోదాదేవి - కదిరి నియోజకవర్గం. మాజీ ఎమ్మెల్యే కందికుంట శివప్రసాద్ భార్య. 
  • లక్ష్మీసాయి ప్రియ - వెంకటగిరి నియోజకవర్గం. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె. పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ కోడలు. 
  • సత్యప్రభ - ప్రత్తిపాడు నియోజకవర్గం. వరుపుల రాజా భార్య. రాజా ఇటీవల గుండెపోటుతో మరణించారు. 
  • వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి - నెల్లూరు పార్లమెంట్ స్థానం పరిధిలోని కోవూరు నియోజకవర్గం. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య. 

Telugudesam
Second List
AP Politics

More Telugu News