K Kavitha: సీబీఐ, ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిందేనా? ... ఈరోజు తేల్చేయనున్న సుప్రీంకోర్టు

Supreme  Court to hear Kavitha petition today

  • ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈడీ, సీబీఐ నోటీసులు
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కవిత
  • ఇటీవలే కవితను నిందితురాలిగా మార్చిన సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తనపై ముందస్తు చర్యలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిల్ బేలా ఎం. త్రివేదీల ధర్మాసనం విచారణ జరపనుంది. 

లిక్కర్ కేసులో గత ఏడాది మార్చిలో ఈడీ ముందు విచారణకు కవిత పలుమార్లు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే సాక్షిగా సీబీఐ విచారించింది. అయితే సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా మారుస్తూ విచారణకు హాజరు కావాల్సిందిగా సీఆర్పీసీ 41ఏ కింద సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ, సీబీఐల ముందు విచారణకు హాజరు కావాలా? లేదా? అనే విషయం ఈరోజు తేలపోనుంది. ఈరోజు జరిగే సుప్రీంకోర్టు విచారణ కీలకంగా మారనుంది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కూడా ఈడీ వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.

  • Loading...

More Telugu News