Mamata Banerjee: మమతా బెనర్జీని ఎవరూ తోయలేదు: ఎస్ఎస్ కేఎమ్ ఆసుపత్రి డాక్టర్లు
- గతరాత్రి నుదుటిపై గాయంతో ఆసుపత్రిలో చేరిన సీఎం మమతా బెనర్జీ
- అపస్మారక స్థితిలో కనిపించిన వైనం
- తన ఇంట్లో జారిపడ్డారన్న తృణమూల్ వర్గాలు
- ఆమెను ఎవరో వెనుక నుంచి నెట్టి ఉంటారని ఈ ఉదయం కథనాలు
- మమత తూలి పడ్డారని స్పష్టం చేసిన కోల్ కతా ఆసుపత్రి వైద్యులు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత రాత్రి తలకు తీవ్ర గాయంతో ఆసుపత్రిలో ఉన్న ఫొటోలు సంచలనం రేపాయి. కోల్ కతాలోని తన ఇంట్లో మమతా బెనర్జీ జారిపడ్డారని, తలకు బలమైన దెబ్బ తగిలిందని తృణమూల్ వర్గాలు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాయి.
అయితే, ఆమెను వెనుక నుంచి ఎవరో తోసి ఉంటారని, అందుకే అంత బలమైన గాయం అయిందని కథనాలు వచ్చాయి. వీటిపై కోల్ కతాలోని ఎస్ఎస్ కేఎమ్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెనుక నుంచి ఎవరూ నెట్టలేదని స్పష్టం చేశారు. ఆమె తూలి పడ్డారని, అందువల్లే నుదుటికి గాయం అయిందని వివరించారు.
కాగా, మమతా బెనర్జీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. తనకు గాయమైందని తెలియగానే స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.