K Kavitha: కవిత అరెస్ట్‌పై న్యాయవాది సోమా భరత్ తీవ్ర ఆగ్రహం

Lawyer Soma Bharat on Kavitha arrest

  • సుప్రీంకోర్టులో చెప్పిన దానికి భిన్నంగా ఈడీ అరెస్ట్ చేసిందని మండిపాటు
  • ఎలాంటి వారెంట్ లేకుండా ఓ మహిళను అరెస్ట్ చేయడం అక్రమమే అవుతుందని వ్యాఖ్య
  • అక్రమ అరెస్ట్‌పై న్యాయపరంగా పోరాటం చేస్తామన్న న్యాయవాది

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆమె తరఫు న్యాయవాది సోమా భరత్ తీవ్రంగా స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆమెను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో చెప్పిన దానికి భిన్నంగా ఈడీ అరెస్ట్ చేసిందని విమర్శించారు. ఎలాంటి వారెంట్ లేకుండా ఓ మహిళను అరెస్ట్ చేయడం కూడా అక్రమమే అవుతుందన్నారు. తీర్పు వచ్చే వరకు తాము ఎలాంటి చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టులో చెప్పి... అందుకు భిన్నంగా కవితను అరెస్ట్ చేయడం పూర్తిగా అన్యాయం... చట్టవిరుద్ధమన్నారు.

మహిళలు, పిల్లలను అరెస్ట్ చేసే సమయం... వారిని విచారించే సమయం గురించి ఇప్పటికే కవిత పోరాడుతున్నారని... దీనిపై త్వరలో సుప్రీంకోర్టులో తీర్పు రానుందని... ఇలాంటి సమయంలో ఆమె అరెస్ట్ ఘోరం... అన్యాయమన్నారు. ఈ అక్రమ అరెస్ట్‌పై తాము న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు. కాగా, ఈడీ అధికారులకు సహకరిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఈ అరెస్టును న్యాయపరంగా, శాంతియుతంగా ఎదుర్కొంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News