K Kavitha: నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు: కోర్టు ఆవరణలో కవిత
- ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన ఈడీ
- కవితను కస్టడీకి అప్పగించాలని కోరిన ఈడీ
- కోర్టు నిర్ణయంపై సర్వత్ర ఉత్కంఠ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశ పెట్టారు. ఆమెను కోర్టు హాల్లోకి తీసుకువెళ్తున్న సమయంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని... తన పోరాటం కొనసాగుతుందని ఆమె అన్నారు. మరోవైపు, కోర్టులో కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు.
లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కవితను ప్రధాన వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఆమెను మరింతగా విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది. రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై టెన్షన్ నెలకొంది. కవితకు జైలా? బెయిలా? అనేది కాసేపట్లో తేలిపోనుంది.