K Kavitha: కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనే కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు: పద్మాదేవేందర్ రెడ్డి

Padma Devender Reddy fires over kavitha arrest

  • లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి అరెస్ట్ చేశారని ఆగ్రహం
  • సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా కావాలనే అరెస్ట్ చేశారని ఆరోపణ
  • కవిత అరెస్ట్‌పై న్యాయపరంగా పోరాడుతామని వెల్లడి

ఈ రోజు లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి... కావాలనే కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. కవిత అరెస్టును నిరసిస్తూ మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాతో నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ... క‌విత‌ అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని మండిపడ్డారు. క‌విత‌ అక్రమ అరెస్ట్‌పై పిటిషన్ వేస్తామన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా కావాలనే అరెస్ట్ చేశారని ఆరోపించారు.

ఈ అక్రమ అరెస్టును తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కవిత అరెస్ట్‌పై న్యాయపరంగా పోరాడతామన్నారు. బీఆర్ఎస్‌కు పోరాటాలు కొత్తకాదని... పార్టీ పుట్టిందే ఉద్యమం కోసమన్నారు. లోక్ సభ ఎన్నికల నేప‌థ్యంలో కుట్రతో క‌విత‌ను అరెస్ట్ చేశారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా... ఎన్ని అరెస్ట్‌లు చేసినా... ఎంతమంది ఈడీలు, మోడీలు వచ్చినా భయపడేది లేదన్నారు. కవితను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News