K Kavitha: ప్రతిరోజూ బంధువులను కలిసేందుకు అనుమతి కోరిన కవిత... ఆమోదం తెలిపిన న్యాయస్థానం

Kavitha asks court for daily meeting with family members and lawyers

  • లాయర్‌ను కలిసేందుకూ కవితకు ఆమోదం
  • ఇంటి భోజనానికి ఓకే చెప్పిన రౌస్ అవెన్యూ కోర్టు
  • మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గది కేటాయింపు

ఈడీ కస్టడీలో తనకు పలు మినహాయింపులు కావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టును శనివారం కోరారు. కోర్టు వీటికి ఆమోదం తెలిపింది. ఈడీ కస్టడీ సమయంలో ప్రతిరోజు తాను బంధువులను కలిసేందుకు అనుమతివ్వాలని, తన లాయర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కవిత కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు అంగీకరించింది.

అలాగే తనకు పుస్తకాలు చదివేందుకు వెసులుబాటు కల్పించాలని... కేసుకు సంబంధించినవి రాసుకోవడానికి అనుమతివ్వాలని కోరారు. తనకు స్పెట్స్ (కళ్లద్దాలు)కు అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటికి న్యాయస్థానం ఓకే చెప్పింది. అలాగే ప్రతిరోజు ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరగా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. కవిత మార్చి 23వ తేదీ వరకు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఆమెకు ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయిస్తారు. అధికారులు ఆమెను ఈడీ కార్యాలయానికి తరలించారు.

  • Loading...

More Telugu News