Election Commission: మొత్తం 543 లోక్‌సభ సీట్లుంటే 544 సీట్లలో పోలింగ్.. కారణం వివరించిన ఈసీ
- కొత్త లోక్‌సభ స్థానాలు ఏవీ ఏర్పాటు చేయలేదని స్పష్టం చేసిన ఈసీ
- మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్ స్థానానికి రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడి
- ఫలితంగా షెడ్యూల్‌లో 544 లోక్‌సభ స్థానాలు ఉన్నాయని వివరణ
భారత ఎన్నికల కమిషన్ శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. దేశ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
అయితే, దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌లో మాత్రం 544 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని ఉంది. దీనిపై పలువురు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈసీ వివరణ ఇచ్చింది.
దేశంలో కొత్త స్థానాలు ఏవీ ఏర్పాటు కాలేదని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ స్పష్టం చేశారు. అయితే, మణిపూర్‌లో ఇన్నర్ మణిపూర్ లోక్‌సభ స్థానానికి రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 19న తొలి విడత, ఏప్రిల్ 26న మలి విడత ఎన్నికలు జరుగుతాయని అన్నారు. ఫలితంగా జాబితాలో ఒక లోక్‌సభ స్థానం అదనంగా కనిపించిందని వివరించారు.