Samantha: ‘ఊ అంటావా’ లాంటి పాటను మళ్లీ చేయను.. సంచలన విషయాలు బయటపెట్టిన సమంత

Samantha Ruth Prabhu uncomfortable and shaking from fear during Oo Antava shoot Actress Recalls
  • ఆ పాట షూటింగ్ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న సమంత
  • నటిగా మరో కోణాన్ని వెతికే ఉద్దేశంతోనే ఆ పాట చేయాల్సి వచ్చిందన్న నటి
  • మరోమారు అలాంటి పాత్రలు చేయబోనని స్పష్టీకరణ
  • ఆ పాట షూటింగ్‌లో చాలా అసౌకర్యంగా ఫీలయ్యానని వెల్లడి
  • సెక్సీ అనేది తనకు సరిపడని విషయమన్న సమంత
  • ఆ పాట చేస్తున్నప్పుడు వణికిపోయానన్న స్టార్ నటి
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా’ సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. ఆ పాటలో ఆమె ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయిపోయారు. తాజాగా ఆ పాటకు సంబంధించిన ఓ విషయాన్ని సమంత బయటపెట్టారు. ఆ పాట షూటింగ్‌లో తనకు చాలా అసౌకర్యంగా అనిపించిందని ‘ఇండియా టుడే కాంక్లేవ్’లో గుర్తు చేసుకున్నారు. 

రాజీ (ఫ్యామిలీ మ్యాన్ 2 సినిమాలోని సమంత పాత్ర)కి ఆ పాత్రని పోలి ఉండడంతోనే ‘ఊ అంటావా‘ పాట చేయాలని అనుకున్నాను. మీ చుట్టూ ఎక్కువమంది లేకపోవడమే మంచి అనేది నా భావన. ఎందుకంటే వారి అభిప్రాయాలను మనపై రుద్దరు. మంచి వైపు ఉన్న కోణం ఇది. అవతలి కోణం ఏంటంటే.. నేను తప్పులు చేయాలి. వాటి నుంచి నేర్చుకోవాలి. నటిగా నేను ఆ కోణాన్ని అన్వేషించాల్సిన ప్రాంతం నుంచే ‘ఊ అంటావా‘ సాంగ్ చేయాలనే నిర్ణయం వచ్చింది. నా లైంగికత వల్ల ఎప్పుడూ అసౌకర్యంగానే ఉన్నాను. నేనెప్పుడూ పూర్తి సౌకర్యంగా కానీ, విశ్వాసంతో కానీ లేను. ఇది సరిపోదు, నేను అందంగా లేను, ఇతర అమ్మాయిల్లా కనిపించను అని అనుకొనే దానిని’’ అని సమంత పేర్కొన్నారు. 

‘ఊ అంటావా’ పాట షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులపై సమంత మాట్లాడుతూ.. ‘‘నా వరకు అది చాలా పెద్ద చాలెంజ్. సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. అందుకే ఆ సమయంలో వణికిపోయాను. అలాంటి అసౌకర్యమైన, కఠిన పరిస్థితుల నుంచి నటిగా, వ్యక్తిగా ఎదుగుతూ వచ్చాను’’ అని సమంత వివరించారు. పుష్ప 2లో మరోసారి ఇలాంటి పాట చేస్తారా? అన్న ప్రశ్నకు చేయబోనని స్పష్టం చేశారు.
Samantha
Oo Antava Song
Pushpa
Tollywood
Tollywood News
Samantha News

More Telugu News