Group 1 Copy: గ్రూప్ 1 పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తో వచ్చిన అభ్యర్థి.. ఏపీలో ఘటన

Group 1 Candidate Entered Exam Hall with cellphone In Ongole
  • కాపీ కొడుతుండగా యువకుడిని పట్టుకున్న ఇన్విజిలేటర్
  • పోలీసులకు అప్పగించిన అధికారులు
  • ఒంగోలులోని కళాశాల కేంద్రంలో ఘటన
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఓ యువకుడు కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఏకంగా పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తో వచ్చాడు. ఫోన్ ద్వారా కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ను అధికారులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఓ యువకుడు సెల్ ఫోన్ తో లోపలికి రావడం కలకలం రేపింది. పరీక్ష రాస్తున్న యువకుడి వద్ద సెల్ ఫోన్ ను గుర్తించిన ఇన్విజిలేటర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పరీక్షలో కాపీ కొట్టేందుకు ఏకంగా సెల్ ఫోన్ తో రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటపుడు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన సిబ్బంది ఏంచేస్తున్నారని పలువురు విద్యావేత్తలు మండిపడుతున్నారు.
Group 1 Copy
Group 1 Exam
Ongole
copying
Andhra Pradesh
AP Groups

More Telugu News