Narendra Modi: పవన్... వాళ్లను కిందికి దించమని పోలీసులకు చెప్పు: ప్రధాని మోదీ

PM Modi interrupts Pawan Kalyan speech after seen some people climbed light towers
  • బొప్పూడి వద్ద ఎన్డీయే కూటమి ప్రజాగళం సభ
  • పవన్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా పైకి లేచిన మోదీ
  • లైట్ టవర్లు ఎక్కిన వారిపై చిరుకోపం
ప్రజాగళం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగిస్తుండగా, మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకున్నారు. పవన్ మాట్లాడుతుండగా... పవన్ కల్యాణ్ అంటూ మోదీ ఒక్కసారిగా పైకి లేవడంతో ఏం జరిగిందోనని అందరూ సైలెంట్ అయిపోయారు.

సభా ప్రాంగణంలో లైట్ టవర్ల పైకి వివిధ పార్టీల కార్యకర్తలు ఎక్కడాన్ని గమనించిన ప్రధాని మోదీ చిరుకోపం ప్రదర్శించారు. "పవన్, వాళ్లను కిందికి దించమని పోలీసులకు చెప్పు" అని సూచించారు. 

"లైట్ టవర్స్ నుంచి దిగిపోండి... మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. ఆ లైట్ టవర్లకు కరెంటు ఉంటుంది... కరెంటు తీగలకు దూరంగా ఉండాలని కోరుతున్నా. ప్రమాదాలు జరిగితే ఎంతో బాధగా ఉంటుంది" అని మోదీ పేర్కొన్నారు. మోదీ కొంచెం గట్టిగానే చెప్పడంతో లైట్ టవర్లు ఎక్కినవారంతా వెంటనే దిగిపోయారు. అనంతరం పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Narendra Modi
Light Towers
Pawan Kalyan
Praja Galam

More Telugu News