Perni Nani: పవన్... నాడు పాచిపోయిన లడ్డూలు ఇవాళ తాజా లడ్డూలుగా ఎలా మారిపోయాయి?: పేర్ని నాని

Perni Nani asks Pawan Kalyan how and why staled Laddoos become fresh in these five years
  • గతంలో విభజన హామీలపై కేంద్రాన్ని విమర్శించిన పవన్
  • కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని వ్యాఖ్యలు
  • ఈ ఐదేళ్లలో తాజా లడ్డూలుగా మారిపోయాయా అంటూ పేర్ని నాని వ్యంగ్యం 
మూడు పార్టీల ప్రజాగళం సభపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. విభజన హామీల నేపథ్యంలో, కేంద్రం ఏమిచ్చింది... పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది అంటూ గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

2014లో  తిరుపతి బాలాజీ సాక్షిగా మా కలయిక జరిగింది అని పవన్ చెప్పారు... మరి 2019లో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలు 2024లో తాజా లడ్డూలుగా మారిపోయాయా... అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"నాడు పవన్ కాకినాడలో పాచిపోయిన లడ్డూల వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఐదేళ్లు గడిచేసరికి ఆ లడ్డూలు చిలకలూరిపేట సభకు వచ్చేసరికి తాజా లడ్డూలు ఎలా అయ్యాయో రాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ చెప్పాడా? ఆ లడ్డూలు ఎంత రుచిగా ఉన్నాయి? ఎందుకు రుచిగా ఉన్నాయి? అని ప్రజలకు ఎందుకని చెప్పలేదు?" అని నిలదీశారు. 

చిలకలూరిపేట సభలో బాబు భజన మామూలుగా లేదన్న పేర్ని నాని

ప్రధాని మోదీ హాజరైన చిలకలూరిపేట సభలో చంద్రబాబు భజన మామూలుగా లేదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇంత మార్పునకు కారణం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి అంతటివాడు మాట్లాడుతుంటే మైక్ పనిచేయకుండా పోయిందని, ఒక సభ జరుపుకోవడం చేతకాకపోతే జగన్ ను ఎలా ఎదుర్కొంటారని ఎత్తిపొడిచారు.
Perni Nani
Pawan Kalyan
Laddoos
YSRCP
Janasena
TDP-JanaSena-BJP Alliance
Chilakaluripet

More Telugu News