Nagababu: మూర్ఖులారా... మీకు ప్రధాని నిన్న 'భ్రష్టాచార్' అనే బిరుదునిచ్చారు: నాగబాబు

Nagababu explains what is Brashtachar termed by PM Modi in Chilakaluripet rally
  • నిన్న చిలకలూరిపేట వద్ద జనసేన-టీడీపీ-బీజేపీ ప్రజాగళం సభ
  • ప్రధాని మోదీ హాజరైన సభలో పలుమార్లు మొరాయించిన మైక్
  • వైసీపీ నుంచి విమర్శలు
  • భ్రష్టాచార్ అంటే ఏంటో వివరించిన నాగబాబు
చిలకలూరిపేట వద్ద నిన్న జరిగిన ప్రజాగళం సభలో పలుమార్లు మైక్ మొరాయించిన సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. 

మైక్ ఫెయిల్, మీటింగ్ ఫెయిల్ అని మొరిగే మూర్ఖులారా విన్నారా... నిన్న గౌరవ ప్రధాని మోదీ గారు మీకు 'భ్రష్టాచార్' అనే బిరుదునిచ్చారని ఎద్దేవా చేశారు. 

"భ్రష్టాచార్ అంటే అవినీతి... అవినీతి అంటే కరప్షన్... అవినీతి అనే కోటకు మకుటం లేని మహారాజు మీ నాయకుడు. ఆ అవినీతి కిరీటాన్ని మాకు కావాలి, మాకు కావాలి మేమేం తక్కువ అని పోటీ పడుతున్న మీరు కూడా మా సభలను విమర్శిస్తుంటే ఎలా నవ్వాలో తెలియడంలేదు. మీ సిద్ధం సభల గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ లు గాల్లో దీపాల్లో తేలిపోతున్నాయి. ముందు మీరు ఆ వీఎఫ్ఎక్స్ ఎడిటర్ ను మార్చితే తప్ప లక్షల్లో జనాలు వచ్చారని ప్రజలను ఏమార్చలేరు. మొదట ఆ పనిలో ఉండండయ్యా బరితెగించిన భ్రష్టాచార్స్" అంటూ నాగబాబు చురకలు అంటించారు.
Nagababu
Narendra Modi
Praja Galam
Chilakaluripet
TDP-JanaSena-BJP Alliance

More Telugu News