Jeevan Reddy: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం

Congress MLC Jeevan Reddy fires at PM Modi
  • షుగర్ ఫ్యాక్టరీ మూతకు బీజేపీయే కారణమని మండిపాటు
  • ప్రధాని నరేంద్ర మోదీ వేషం ఇప్పటికి రెండుసార్లు చూశామన్న కాంగ్రెస్ నేత
  • జగిత్యాల సభలో మోదీ అన్నీ అబద్ధాలే చెప్పారన్న జీవన్ రెడ్డి
షుగర్ ఫ్యాక్టరీ మూతకు బీజేపీయే కారణమని... దీనిని మీరే మూసివేసి మీరే తెరుస్తానంటారా? అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్ర మోదీ వేషం ఇప్పటికి రెండుసార్లు చూశామని విమర్శించారు. జగిత్యాల సభలో ఆయన అన్నీ అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదని... పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని చెప్పారు.

పదేళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా... మళ్లీ ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని అంటారేమిటని నిలదీశారు. ఇన్నాళ్ళు షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు ఓపెన్ చేయలేదో చెప్పాలన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయిదేళ్లు ఏం చేశారు? అని ప్రశ్నించారు.
Jeevan Reddy
Narendra Modi
BJP
Congress

More Telugu News