RS Praveen Kumar: రేవంత్ రెడ్డీ... నేనూ పాలమూరు బిడ్డనే, నాకు వార్నింగ్ ఇవ్వడం మానుకో: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

RS Praveen Kumar says dont warning me

  • ఏదో ఆశించి కాదు... తెలంగాణ పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వెల్లడి
  • తెలంగాణ వాదం... బహుజన వాదం ఒక్కటేనన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
  • చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారని ప్రశంస
  • రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే అందులో చేరుతున్న గొర్రెల్లో తాను ఒకడిని కాదల్చుకోలేదని వ్యాఖ్య

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తానూ పాలమూరు బిడ్డనేనని... తనకు వార్నింగ్‌లు ఇవ్వడం మానుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడి నుంచి గజ్వేల్ బయలుదేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తాను ఏదీ ఆశించి బీఆర్ఎస్‌లో చేరడం లేదని... తెలంగాణ పునర్నిర్మాణం కోసం... తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం తాను బీఆర్ఎస్‌లోకి వెళుతున్నానని పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా బహుజనుల ప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు.

తన వెంట నడిచే అభిమానులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ వాదం... బహుజన వాదం రెండూ ఒకటే అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందన్నారు. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీలో చేరుతున్నానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారన్నారు. గత పదేళ్లు తెలంగాణ స్వర్ణయుగమన్నారు.

కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తనకు టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చారని... కానీ దానిని తిరస్కరించానని చెప్పారు. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు. రేవంత్ రెడ్డి, తాను పాలమూరు బిడ్డలమని... కాబట్టి ఆయన తనను బెదిరించడం మానుకోవాలని సూచించారు. ఆయన బెదిరింపులకు భయపడేది లేదన్నారు. మీరు గేట్లు తెరిస్తే అందులో చేరుతున్న గొర్రెల్లో తాను ఒకడిని కాదల్చుకోలేదని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాగా, ఆయన తెలంగాణ భవన్ నుంచి గజ్వేల్‌కు బయలుదేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు.

  • Loading...

More Telugu News