Raghunandan Rao: జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై రఘునందన్ రావు స్పందన

Raghunandan Rao responds on Jithender Reddy joining congress
  • సమీకరణాల మేరకు పార్టీ మారుతున్నారని వ్యాఖ్య
  • అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్ రెడ్డికి ఉందా? అని ప్రశ్న
  • కుమారుడికి సీటు ఇస్తే సిద్ధాంతం ఉంటుంది... సీటు ఇవ్వకపోతే ఉండదా? అని నిలదీత
మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లడంపై బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... సమీకరణాల మేరకు కొంతమంది పార్టీలు మారుతున్నారని చెప్పారు. అసలు సిద్ధాంతం గురించి మాట్లాడే అర్హత జితేందర్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. తన కుమారుడికి సీటు ఇస్తే సిద్ధాంతం ఉంటుంది... సీటు ఇవ్వకపోతే ఉండదా? అని ప్రశ్నించారు.

జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల బాగోతాలు బయటపెడతామని హెచ్చరించారు. వీరిద్దరు పార్టీ మారడం వెనుక ఆర్థిక లబ్ధి ఉందని ఆరోపించారు. పార్టీ మారడం వెనుక వందల కోట్లు చేతులు మారుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. అ డబ్బుతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఫండింగ్ ఇవ్వబోతున్నారని ఆరోపించారు. ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి లాభం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు? అని ప్రశ్నించారు. తమకు అన్నీ తెలుసునని... తమ వద్ద అంత సమాచారం ఉందన్నారు.
Raghunandan Rao
BJP
Telangana

More Telugu News